#HBDSuperstarMAHESH ! Join the journey of #Rishi - #Maharshi! #MeetRishi - Teaser of #Maharshi at 9:09AM 9th !

Meet Rishi - Maharshi

Jul 22, 2010

గుంటూరులో “ఖలేజా” ఆడియో..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ప్రిన్స్’ మహేష్ బాబు తాజా చిత్రం “ఖలేజా” (పేరు పరిశీలనలో ఉంది) ముంబాయిలో షూటింగ్ పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ జూలై 14 నుండి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

“సూపర్‌స్టార్” కృష్ణ గారి అభిమాని జితేంద్ర కు సంబంధించిన వాళ్ళ ఇల్లు తో పాటు, హైదరాబాదులోని “ఓక్రిడ్జ్ స్కూల్” లో షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఆగస్టు 1 నుండి 10 వ తేదీ వరకు జరిగే షెడ్యూల్ లో రెండు పాటల చిత్రీకరణతో ఈ సినిమాకి సంబంధించి టాకీ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత గుంటూరులోని “బ్రహ్మానందరెడ్డి స్టేడియం” లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని తెలిసింది.

ఈ సినిమాలో మహేష్ బాబు “రాజా” గా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న అనుష్క “సుభాషిణి” గా కనిపించనున్నట్లు సమాచారం.

No comments: